సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. థియేటర్లలో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఆధారంగా తీసుకుని 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడటంతో.. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని ప్రొడ్యూసర్లు ఎప్పటినుంచో కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.