పవన్ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీకి ఛాన్స్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో రానున్న సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్‌లో పవన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. అయితే క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా… ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెట్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి.

pawan and krish movie

అయితే తాజాగా ఈ విషయంపై నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. పవన్ సినిమాలో తాను నటించబోతున్నానని, తన కల నెరవేరబోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించింది. పవన్ అంటే తనకు ఎంతో అభిమానం అని, అందుకే ఆయనతో వర్క్ చేయాలని చాలాకాలంగా వెయిట్ చేస్తున్నానంది.