Manchu Family: డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు కుమారుడు హీరో మంచు విష్ణు తన భార్యతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం సీఎం జగన్‌ను కలిసారు. అయితే తండ్రి మోహన్‌బాబు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నాడు కదా అందుకే వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారా అనేది మీ సందేహం.. కాదు కాదు.. వివరాల్లోకి వెళితే.. మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి, సీఎం జగన్‌గారికి బంధువు అనే విషయం తెలిసిందే.
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు సుధాకర్‌రెడ్డి కుమార్తె విరానికా రెడ్డి. దీంతో Manchu Family మంచు వారికి వైఎస్ జగన్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు, అతని భార్య విరానికా రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌లో జగన్ దంపతులతో సమావేశం అయ్యారు. అనంతరం వీరిద్దరి దంపతులకు సీఎం జగన్ ఆతిథ్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.