ఖిలాడీ కోసం రంగంలోకి దిగిన అర్జున్

క్రాక్ సినిమాతో విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రవితేజ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రమేష్ వర్మ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రాక్ హిట్ కావడంతో.. ఖిలాడీ సినిమాకు రవితేజ రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.

arjun join khiladi shooting

అయితే ఈ సినిమాలో నటుడు అర్జున్ నటిస్తుండగా.. తాజాగా అర్జున్ ఖిలాడీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. రవితేజ, అర్జున్ మధ్య కొన్ని కీలక సన్నివేశాను మేకర్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో నటించేందుకు అర్జున్ ఆచితూడి వ్యవహారిస్తున్నాడు. ఖిలాడీలోని పాత్ర నచ్చడంతో.. నటించేందుకు ఒకే చెప్పాడు.