సీనియర్ నటి ఆమనికి అస్వస్థత

సీనియర్ నటి ఆమని స్వల్ప అస్వస్థతకి గురైంది. సినిమా షూటింగ్‌లో అస్వస్థతకి గురి కావడంతో.. సిబ్బంది ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమని కోలుకుని డిశ్చార్జ్ అవ్వడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తున్న బజార్ రౌడీ సినిమాలో ఆమని కీలక పాత్రలలో నటిస్తోంది.

AAMANI HOSPITAL

ఇక ఆమని ప్రధాన ప్రాతలో నటిస్తున్న అమ్మదీవెన సినిమా ఇవాళ విడదలైంది. ఇక పలు సినిమాల్లో ఆమనికి ఆఫర్లు వస్తున్నాయి. సిసింద్రి, జంబలకిడి పంబ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, శుభ సంకల్పం, ఘరానా బుల్లోడు, మాయాబజార్, ఆ నలుగురు, చందమామ కథలు సినిమాలతో ఆమని నటిగా మంచి పేరు తెచ్చుకుంది.