కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. విజయ్ నటన, విలన్‌గా విజయ్ సేతుపతి యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఫలితంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న క్రమంలో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకుపైగా భారీ వసూళ్లను సాధించింది. ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సొంతం చేసుకుంది.
అయితే ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మాస్టర్ స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన 16 రోజుల్లోనే మాస్టర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం విశేషం. అమెజాన్ భారీ ఆఫర్ ఇవ్వడంతోనే మాస్టర్ మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం రూ.36 కోట్లు పెట్టి అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాములుగా ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు భావించారు. కానీ అనుకున్న సమయం కంటే ముందేగా రిలీజ్ చేస్తున్నందుకు అమెజాన్ ప్రైమ్ మరో రూ.15 కోట్లు చెల్లిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.