Sonusood: రియ‌ల్‌హీరో కోసం 2వేల కిలోమీట‌ర్లు సైక్లింగ్‌.. స్పందించిన సోనూసూద్‌!

Sonusood: ప్ర‌ముఖ సినీ న‌టుడు సోనూసూద్ క‌రోనా క‌ష్ట కాలంలో చేసిన సాయం అంతాఇంతా కాదు.. ఆయ‌న సేవ‌ల్ని ప్ర‌పంచం మొత్తం కొనియాడింది. ఎక్క‌డ ఆప‌ద ఉన్నా.. వెంట‌నే స్పందించి సాయం చేసేందుకు ముందుకొచ్చేవాడు సోనూసూద్‌. దీంతో దేశ‌వ్యాప్తంగా రియ‌ల్‌హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు సోనూ.. ఈ విష‌యం అలా ఉంచితే.. తాజాగా ఈ Sonusood రియ‌ల్ హీరో కోసం ఏకంగా 2వేల కిలో మీట‌ర్లు సైక్లింగ్ చేయాల‌ని ఓ వ్య‌క్తి నిర్ణ‌యించుకున్నాడు.

sonuuusood

అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రు అంటే?.. మ‌హారాష్ట్ర‌లోని వ‌షీమ్ ప్రాంతానికి చెందిన నారాయ‌ణ్ కిష‌న్‌లాల్ వ్యాస్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక‌, జాతీయ స‌మ‌స్య‌ల మీద తాను ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా సైక్లింగ్ చేస్తున్నాన‌ని.. ఈ సారి Sonusood రియ‌ల్‌హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా సోనూసూద్ కోసం సైక్లింగ్‌ను.. ఫిబ్ర‌వ‌రి7 నుంచి ఫిబ్ర‌వ‌రి 14వ‌ర‌కు వారం రోజుల పాటు 2వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. మ‌హారాష్ట్ర నుంచి రామ‌సేతు వ‌ర‌కు వ్యాస్ ఈ ప్ర‌యాణం సాగ‌నుంది.. వ‌షీమ్ నుంచి ప్రారంభ‌మై.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు-మ‌ధురై-రామ‌సేతు మార్గాల ద్వారా 2వేల కిలోమీట‌ర్లు సైక్లింగ్ ను పూర్తి చేయాల‌ని సంక‌ల్పించిన‌ట్టు వ్యాస్ పేర్కొన్నాడు. ఇక దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. నా కోసం నారాయ‌ణ్ కిష‌న్ లాల్ వ్యాస్ చేయాల‌నుకుంటున్న రైడ్.. తాను ఎప్ప‌టికీ పొంద‌లేని అతి పెద్ద పుర‌స్కారం ఇదే అని Sonusood సోనూ ఆనందంవ్య‌క్తం చేశారు.