Raviteja: మాస్కు కేరాఫ్ అడ్రస్ అయినా మాస్ మహారాజ్ రవితేజ నేడు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. యూత్ ఫుల్ ఎనర్జీ తెరపై ఎంతో ఎనర్జీటిక్తో కనిపించే రవి శంకర్ రాజు భూపతిరాజు.. యూత్ మెచ్చే టాలీవుడ్ హీరో. పక్కా మాస్ చిత్రాల నాయకుడు. రెండు దశాబ్దలుగా ప్రేక్షకులను అలరిస్తున్న రవి శంకర్ రాజు భూపతి రాజు ఎవరా? అని ఆలోచన అవసరంలేదు.. Ravitejaరవితేజ అనే నాలుగు అక్షరాలతో ఇమిడిపోయిన ఎనర్జీటిక్ స్టార్. మరో మాటలో చెప్పాలంటే మాస్ మహారాజ్. తెలుగు ప్రేక్షకుల్లో తన మాస్ నటనతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రవితేజ జనవరి 26 న బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.
ఏపీలోని కాకినాడలో రవితేజ జనవరి 26న 1968సంలో రాజ్‌గోపాల్-రాజ్యలక్ష్మీ దంపతులకు జన్మించారు. వీరికి ముగ్గురు కొడుకుల్లో Raviteja రవితేజ పెద్దవాడు. రవితేజ తండ్రి ఫార్మసిస్ట్‌గా పనిచేసేవారు. తల్లి రాజ్యలక్ష్మీ గృహిణి. అలాగే రవితేజ విద్యాభ్యాసం జైపూర్, దిల్లీ, ముంబై, భూపాల్ ప్రాంతాల్లో జరిగింది. ఆ తర్వాత విజయవాడలోనే సిద్ధార్థ డిగ్రీ కాలేజ్‌లో బి.ఎలో చేరాడు. సినిమాలపై మక్కువతో 1988లో చెన్నైకి వెళ్లారు రవితేజ. చెన్నైలో Raviteja రవితేజ ఉండే రూమ్‌లోనే ప్రముఖ దర్శకులు వైవిఎస్. చౌదరి, గుణశేఖర్ ఉండేవారు.. విజయశాంతి నటించిన కర్తవ్యం, చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంను హిందీలో తెరకెక్కిన ఆజ్ కా గూండా రాజ్ అనే చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు రవితేజ. ఒక పక్క నటిస్తూనే మరో పక్క అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమాలకు పనిచేసేవాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్నే పెళ్లాడుతా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఓ చిన్న పాత్రలో నటించాడు రవితేజ.. ఈ చిత్రానికి నాగార్జున చేతుల మీదుగా 3,050 రూ చెక్‌ను Raviteja రవితేజ తొలి పారితోషికం అందుకున్నాడు. ఆ తర్వాత సిందూరం, సీతారామ రాజు, పాడుతా తీయగా, మనసిచ్చి చూడు, ప్రేమకు వేళాయెరా, పలు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన నీకోసం చిత్రంలో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన అన్నయ్య చిత్రంలో Raviteja రవితేజ నటించి ప్రేక్షకులకు మరింత చేరవయ్యాడు. ఇక 2001లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో రవితేజ నటించి ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాతో రవితేజ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే చిత్రాల్లో రవితేజ పెర్ఫార్మన్స్, డైలాగ్ డెలివరీకి విమర్శకులు, సినిమా ప్రేమికుల నుంచి ప్రశంసలు బాగా వచ్చాయి. అలాగే ఖడ్గం, దొంగోడు, వీడే, ఇలా పలు సినిమాలతో సినీ ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు రవితేజ. ఇక Raviteja రవితేజ నటించిన క్రాక్ చిత్రంను 2021 సంక్రాతికి రిలీజ్ చేశారు. ఈ చిత్రం మంచి హిట్ సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఆయన ఖిలాడి చిత్రంలో నటిస్తున్నారు. నేడు రవితేజ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రబృందం. చేతిలో ఆయుధాన్ని పట్టుకుని రవితేజ స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నాడు.. ఇందులో Raviteja ఆయన హావభావాలకు తగ్గట్టుగా దేవీశ్రీప్రసాద్ అద్భుతంగా బ్యాగ్రాండ్ మ్యాజిక్ వినబడుతోంది. ఈ చిత్రానికి రమేశ్ వర్మ డైరెక్షన్ చేస్తుండగా.. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. రవితేజకు వచ్చిన పురస్కారాలు విషయాలు చూద్దాం.. నీ కోసం, ఖడ్గం, సినిమాలకు నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు. నేనింతే చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు రవితేజ. Raviteja రవితేజ వివాహం 2000వ సంవత్సరంలో కళ్యాణితో జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.