Kajal: తొలిసారి కాజ‌ల్ న‌టించిన వెబ్‌సిరీస్ త్వ‌ర‌లో..

Kajal: టాలీవుడ్ అగ్ర‌క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్ తొలిసారిగా ఓ వెబ్‌సిరిస్‌తో మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌డాన‌కి రాబోతుంది. భ‌య‌పెట్ట‌డం ఏంటీ అనుకుంటున్నారా?.. ఆమె న‌టించిన‌ వెబ్‌సిరీస్ లైవ్ టెలికాస్ట్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 12న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ విఐపిలో రిలీజ్ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. ఈ లైవ్ టెలీకాస్ట్ వెబ్‌సిరీస్‌లో కాజ‌ల్‌తో పాటు వైభ‌వ్‌, ఆనంది త‌దిత‌రులు క‌నిపిస్తారు.

live telecast

Kajal లైవ్ టెలికాస్ట్ అనేది ప‌ది ఎపిసోడ్‌ల సిరీస్‌.. పారానార్మ‌ల్ యాక్టివిటీస్ త‌ర‌హాలో ట్రై చేస్తున్నార‌ట‌. తాజాగా చిత్ర‌బృందం రిలీజ్ చేసిన ఈ వెబ్‌సిరీస్ పోస్ట‌ర్‌లో కాజ‌ల్ త‌న టీమ్‌తో భ‌య‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో లైవ్ టెలికాస్ట్ వెబ్‌సిరీస్ ద్వారా భ‌య‌ప‌ట్టేందుకు Kajalకాజ‌ల్ సిద్ధ‌మ‌వుతుంది. కాజ‌ల్ న‌టించిన ఈ వెబ్‌సిరీస్ తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌స్తుతం కాజ‌ల్.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, క‌మ‌ల్‌హాస‌న్ భార‌తీయుడు-2, మంచు విష్ణు మోస‌గాళ్లు భారీ చిత్రాల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది Kajal.