అనగనగా ఓ అబ్బాయి. పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. దాంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. ‘కార్తీక్ మిస్సింగ్’ అని ఫొటోలు విడుదల చేస్తారు. అయితే… అతడు కార్తీక్ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీక్ ఆ… కృష్ణమూర్తి ఆ? మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టు… కార్తీక్ లాంటివాడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకొకరు ఎవరైనా కృష్ణమూర్తిలా మారి అమ్మాయిలను మోసం చేశాడా? ఈ సస్పెన్స్ కి జూన్ 5న తెర దించుతామని రమేష్ వర్మ చెబుతున్నారు.
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. గురువారం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. జూన్ 5న సినిమా విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ “ట్రైలర్, ఇప్పటివరకూ విడుదలైన పాటలకు అద్భుత స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల్లో సినిమాకు వస్తున్న స్పందన చూసి బిజినెస్ బాగా జరిగింది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల హక్కులను తీసుకుంది. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది” అన్నారు.
హీరో హవీష్ మాట్లాడుతూ “మంచి కథతో రూపొందిన చిత్రమిది. న్యూ ఏజ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇంతమంది హీరోయిన్లతో ఇటువంటి కథతో సినిమా చేయడం కష్టం. రమేష్ వర్మగారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది. ట్రైలర్, పాటలకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ ఎంత కొత్తగా ఉందో… సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది” అన్నారు.
సినిమాలో తారాగణం:
పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.
సినిమా సాంకేతిక వర్గం:
స్టిల్స్: శీను, పీఆర్వో: ‘బియాండ్ మీడియా’ నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ, వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్, చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై, కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్), ఆర్ట్ డైరెక్టర్: గాంధీ, లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్, కొరియోగ్రఫీ: సతీష్, విజయ్, డైలాగ్స్: జీఆర్ మహర్షి, స్టంట్స్: వెంకట్ మహేష్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ – దర్శకత్వం నిజార్ షఫీ.