కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యవసాయ చట్టాలను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. నూతన వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, రైతు చట్టాలపై సమగ్ర చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీలో గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. దేశ రాజధానిలోని రహదారులను దిగ్భంధించి ఉద్యమం చేశారు. ఈ ఉద్యమానికి దేశ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. పలువురు సినీ హీరోలు, హీరోయిన్లు, నటుడు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.