పవన్ నిర్మాతగా వరుణ్ తేజ్‌తో సినిమా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల తర్వాత పవన్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో.. దీనిపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని షూటింగ్ ఇప్పటికే ముగియగా.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న టీజర్ విడుదల చేయనున్నారు.

pawan movie with varun tej

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతుండగా.. సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో మరో వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ మరోసారి నిర్మాతగా మారనున్నాడనే వార్త బాగా వినిపిస్తోంది. పవన్‌కు ఇప్పటికే క్రియేటివ్ వర్క్స్ పేరిట సొంత బ్యానర్ ఉంది. ఈ బ్యానర్‌పై గతంలో సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగా సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు వరుణ్ తేజ్‌ హీరోగా క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఒక సినిమా రానుందని వార్తలొస్తున్నాయి. పవన్‌తో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు తీసిన డాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట.