ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ఈడీ షాకిచ్చింది. ఈ నెల 11న విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరంబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, టైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ ఇటీవల బదిలీ అయింది. ఈ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. ఈ మేరకు జగన్‌ను నోటీసులు జారీ చేసింది. దీంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే జగన్‌పై ఉన్న సీబీఐ కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.