ప్రముఖ కన్నడ హీరోయిన్, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామికి చీటింగ్ కేసులో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెకు సెంట్రల్ క్రైమ్ బ్యాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని కోరారు. దీంతో ఇవాళ సీసీబీ పోలీసుల ముందు రాధిక కుమారస్వామి విచారణకు హాజరుకానుంది.
ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్ఎస్ఎస్ చోటా నాయకుడు యువరాజ్ ఒక మితవాద సంస్థకు చెందినవాడని, నటులు, వ్యాపారవేత్తలు,రాజకీయ నాయకులతో సహా అనేక మంది వీవీఐపీలను మోసం చేశాడని గుర్తించారు. యువరాజ్ బ్యాంకు అకౌంట్ నుంచి నటి రాధికా కుమారస్వామి, మరో నిర్మాతకు కోటి రూపాయిల వరకు బదిలీ అయినట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై ఇప్పటికే రాధిక సోదరుల్ని పోలీసులు ప్రశ్నించారు.
తనకు వచ్చిన నోటీసులపై రాధికు కుమారస్వామి స్పందించింది. ఆయన అకౌంట్ నుంచి రూ.15 లక్షలు ఒక సినిమా అడ్వాన్స్‌గా తన ఖాతాకు బదిలీ అయిందన్నారు. తన తమ్ముడు రవిరాజ్ అకౌంట్‌కు ఏమీ బదిలీ కాలేదన్నారు.