కేజీఎఫ్‌-2 అధీర పాత్ర‌కు గంట‌న్న‌ర మేక‌ప్‌: సంజ‌య్‌ద‌త్

కేజీఎఫ్‌-2లో తాను పోషించిన అధీర పాత్ర ఎలా ఉండ‌బోతుందో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ ఓ ఇంట‌ర్వ్యూతో ముచ్చ‌టించారు. సంజ‌య్‌ద‌త్ చెబుతూ.. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్‌తో ప‌నిచేయ‌డం ఎంతో సౌక‌ర్యంగా అనిపించింది. కేజీఎఫ్ సెట్‌లో ఆయ‌న ఎంతో కూల్‌గా ఉండేవారని తెలిపారు. తొలిసారి ప్ర‌శాంత్‌నీల్‌తో ప‌నిచేసినా.. చాలా సంతోషంగా అనిపించిందని.. మా ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింద‌ని సంజు తెలిపారు. ఆయ‌న నుంచి ఎన్నో నేర్చుకునేలా చేసిందన్నారు. ప్ర‌శాంత్ నాకు క‌థ చెప్ప‌గానే ఎంతో ఆస‌క్తిగా అనిపించిందని, అందుకే మ‌రో ఆలోచ‌న లేకుండా ఓకే చెప్పేశాన‌ని చెప్పారు.

KGF2 SANJAYDUTT

ఇక ఈ సినిమాలో అధీర పాత్ర‌ను ఎంజాయ్ చేస్తూ చేశాన‌ని, కేజీఎఫ్ చాప్ట‌ర్‌-1 కు మించి ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉంటాయ‌న్నారు. అలాగే హీరో య‌శ్‌, తాను పోటా పోటీగా త‌ల‌ప‌డ్డామ‌ని.. ఆ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ప్రేక్ష‌కులు వెండితెర‌పై చూసి ఎంజాయ్ చేయాల్సిందేన్నారు. అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కూ తాను పోషించిన పాత్ర‌ల్లో అధీర పాత్ర చాలా ప్ర‌త్యేక‌మైందని, భ‌యం, ద‌యాదాక్షిణ్యాలు లేని అతి క్రూరుడు అధీర పాత్ర‌ని తెలిపారు. ఈ పాత్ర కోసం శారీర‌కంగా ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చేది. మేక‌ప్ వేసుకోవ‌డానికే గంట‌న్న‌ర‌కు పైగా ప‌ట్టేద‌ని.. చాలా రోజుల త‌ర్వాత ఇలాంటి బ‌ల‌మైన పాత్ర పోషిస్తున్నాన‌ని అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీ‌నిధిశెట్టి న‌టిస్తుండ‌గా.. ర‌వీనాటాండ‌న్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, రావుర‌మేశ్ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.