ఈ ఏడాది లాక్డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో.. చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదల అయ్యాయి. కరోనా కాలంలో ప్రేక్షకులు కూడా ఇంట్లోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీల వల్ల చేతిలోని ఫోన్లోనే సినిమా చూసే అవకాశం ఉండటంతో.. థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది ఓటీటీలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
లాక్డౌన్లో ఓటీటీలో రిలీజ్ అయిన తొలి సినిమా ‘అమృతరామమ్. జీ5లో రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆహా యాప్‌లో విడుదల అయిన ‘భానుమతి రామకృష్ణ’ ఆకట్టుకోలేకపోయింది.
ఇక ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘జోహార్’ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయిన నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ సినిమా ప్లాప్ అయింది. ఇక అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ప్లాప్ అవ్వగా.. సుహాస్, చాందినీ చౌదరి నటించిన ‘కలర్ ఫొటో’ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా సినిమా ప్లాప్ అవ్వగా.. ‘గతం’ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఓటీటీలో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా సూపర్ హిట్ అయింది.