ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కొత్త స్టూడియోను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చెన్నైలో ఒక థియేటర్ ఇప్పటికే కొనుగోలు చేయగా.. స్టూడియో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 2020లో ఈ స్టూడియోను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు త్వరలోనే ఇళయరాజా కొత్త స్టూడియో ప్రారంభంకానుందని సమాచారం.
చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో ఒక రూమ్ని ఆఫీస్గా చేసుకుని ఇప్పటివరకు ఇళయరాజా మ్యూజిక్ చేస్తూ వచ్చారు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన అక్కడ ఉంటున్నారు. కానీ ఆ స్టూడియో నుంచి ఇళయరాజాను నిర్వాహకులు ఖాళీ చేయించారు. దీనిపై గత డిసెంబర్లో ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. తన గదిలోకి వెళ్లేలా పర్మిషన్ ఇవ్వాలని, చట్టవిరుద్ధంగా తన గదిలోని వస్తువులను బయటపడేయటం సరికాదన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా బయటికి తోసేయడం సరికాదంటూ కోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. గదిలోకి వెళ్లడానికి ఇళయరాజాకు అనుమతి ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొత్త స్టూడియో ప్రారంభించాలని ఇళయరాజా నిర్ణయం తీసుకున్నారు.