సిక్స్ ప్యాక్‌లో పెళ్లైన హీరో

సిక్స్ ప్యాకులతో ప్రేక్షకులను టాలీవుడ్ హీరోలు సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సీనియర్ హీరోలే కాదు.. యంగ్ హీరోలు కూడా సిక్సు ప్యాకులతో మెస్మరైజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పటికే సిక్సు ప్యాకులతో అభిమానులను అలరించగా.. యంగ్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఖాళీ సమయం దొరకడంతో హీరోలు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇలా లాక్‌డౌన్‌ను ఉపయోగించుకుని యంగ్ హీరో నాగశౌర్య, సందీప్ కిషన్ ఇప్పటికే సిక్స్ ప్యాక్స్‌ చేశారు.

NIKHIL

వారికి పోటీగా ఇప్పుడు నిఖిల్ సిక్స్ ప్యాకులతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఒక షర్ట్ లెస్ లుక్ ఫొటోలను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో సిక్సు ప్యాకులతో నిఖిల్‌ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. లాక్‌డౌన్‌లో బాగా వర్కౌట్ చేసి ఇలా తయారు అయినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా ఈ యంగ్ హీరో ఇలా సిక్సు ప్యాకులతో కనిపించడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ నటిస్తుండగా.. త్వరలో దీని షూటింగ్ ప్రారంభం కానుంది. చందుమెండేటి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు ’18 పేజెస్’ సినిమాలో కూడా నిఖిల్ నటిస్తున్నాడు.