సన్నీ లియోనీ కొత్త సినిమా మొదలైంది

బాలీవుడ్ నటి సన్నీ లియోనీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాల్లో మెరిసిన ఆమె.. చివరిగా 2019లో వచ్చిన ‘మోతీచూర్ చక్కాచూర్’ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఆ తర్వాత కరోనా రావడం, లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌లు బంద్ కావడంతో అమెరికా చెక్కేసింది. భర్త, పిల్లలతో కలిసి లాక్‌డౌన్‌లో తెగ ఎంజాయ్ చేసింది. లాక్‌డౌన్ తర్వాత గత నెలలో ముంబైకి తిరిగి వచ్చేసింది.

SUNNY LEONE

తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టి సన్నీ లియోనీ.. తాజాగా ‘అనామిక’ అనే కొత్త సినిమాకు ఓకే చెప్పింది. ఇది థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమాను తాజాగా ప్రారంభించగా.. క్లాప్ బోర్డును పట్టుకుని ఉన్న ఫొటోలను సన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. విక్రమ్ భట్ ఈ సినిమాను డైరెక్షన్ చేయనున్నాడు.

మంచిగా ఉండే విక్రమ్ భట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభమైంది అంటూ సోషల్ మీడియాలో సన్నీ తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత తాను నటిస్తున్న తొలి సినిమా ఇదేనని, ఇందులో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది