బాలీవుడ్ హాట్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్ షాల్‌తో కలిసి వెకేషన్‌కి వెళ్లనుంది. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు. సుస్మిత, ఆమె కూతుళ్ల ఫ్యామిలీ ఈవెంట్స్‌కి ఎప్పుడూ రోహ్మన్ హాజరవుతూ ఉంటాడు. అయితే త్వరలో నూతన సంవత్సరం వస్తుండటంతో.. హాలీడే ట్రిప్ కోసం ఈ జంట దుబాయ్‌కి చెక్కేసినట్లు తెలుస్తోంది. సుస్మితా కూతుళ్లు రెనీ, అలిషా కూడా ఈ ట్రిప్‌లో పాల్గొననున్నారు.
కరోనా ప్రభావం నేపథ్యంలో జనవరి తర్వాత సుస్మితా- రోహ్మన్ షాల్ ఎక్కడికి వెళ్లలేదు. ఇప్పుడు చాలారోజుల తర్వాత ట్రిప్‌కి వెళుతుండటంతో చాలారోజుల పాటు దుబాయ్‌లోనే ఎంజాయ్ చేసే అవకాశముంది. అక్కడ ఉన్న బంధువుల ఇళ్లల్లో చాలాకాలం గడిపే అవకాశముందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
అయితే లాక్డౌన్ కారణంగా చాలా నెలల పాటు ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు.. ఇప్పుడు కాస్త షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి హాలీడే ట్రిప్‌కు వెళుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు మాల్ధీవులకు వెళ్లి అక్కడ బికినీలతో రచ్చ రచ్చ చేశారు. హీరోయిన్లు బికినీలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… అవి సోషల్ మీడియాలో కాస్త వైరల్‌గా మారాయి.