మెగా డాటర్ నిహారిక పెళ్లి నిన్న సాయంత్రం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిహారికకు జోన్నలగడ్డ చైతన్య మూడు ముళ్లు వేసిన ఫొటోలతో పాటు వధూవరులను గెస్ట్‌లు ఆశీర్వదిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. వీటితో పాటు మెగా ఫ్యామిలీ అందరూ కలిసి దిగిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా డిఫరెంట్ డ్రెస్‌లలో స్ట్రైలిష్‌గా కనిపించారు. ప్రధానంగా ఈ పెళ్లిలో స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహ దంపతులు తమ కాస్ట్యూమ్స్‌తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
బాగా పెరిగిన తలకట్టు గుబురుగా పెంచిన గడ్డంతో పెళ్లిలో బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ షూస్ ధరించి అల్లు అర్జున్ అందరిని ఆకర్షించాడు. భార్య స్నేహతో పాటు నిహారిక-చైతన్య జంటతో ఈ బ్లాక్ డ్రెస్‌లో అల్లు అర్జున్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా మారాయి. ఈ బ్లాక్ డ్రెస్‌లో బన్నీ చాలా స్ట్రైలిష్‌గా ఉన్నాడని, బన్నీ లుక్ చాలా బాగుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక బన్నీ ధరించిన ఈ బ్లాక్ డ్రస్ కాస్ట్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ బ్లాక్ డ్రస్ విలువ రూ.3 లక్షల 30 వేలు అని తెలుస్తోంది. ఈ డ్రెస్ కాస్ట్ గురించి తెలుసుకున్నవారు ఆశ్చర్యపోతున్నారు. అల్లు అర్జున్ మాములుగానే ఖరీదైన దుస్తులతో పాటు ఫోన్, వాచ్‌లు వాడతారు. ఇక పెళ్లిలో అంత ఖరీదైన దుస్తుల్లో కనిపించడంలో తప్పు లేదని నెటిజన్లు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో బన్నీ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.