నాగ్ కామెంట్స్‌పై నెటిజన్లు సెటైర్లు

యాపిల్ ప్రొడక్ట్స్‌పై టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్‌లోని యాపిల్ స్టోర్ నుంచి యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నాగ్ ట్వీట్ చేశాడు. యాపిల్ సేవలు, పాలసీలు ఏకపక్షంగా ఉన్నాయని, ఇది మరీ ఘోరమైన చర్య అని నాగార్జున ఫైర్ అయ్యాడు. అయితే యాపిల్ సేవలు పట్ల నాగార్జున ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటీ అనేది మాత్రం ఇంకా తెలియలేదు.

nagarjuna

మాములుగా యాపిల్ ప్రొడక్ట్స్‌కి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. యాపిల్ ప్రొడక్ట్స్‌ని కొనుగులు చేయాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. యాపిల్ ఫోన్లను హ్యాక్ చేయడం చాలా కష్టం. అందుకనే సెలబ్రెటీలు ఎక్కువగా వీటిని వాడతారు. కొంతమంది తమ స్టేటస్ చూపించుకోవడానికి వీటిని వాడతారు. ట్వీట్‌ను బట్టి చూస్తుంటే నాగార్జున కూడా యాపిల్ ఫోన్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే నాగార్జున చేసిన ట్వీట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అందుకే రెడ్ మీ ఫోన్ ఉపయోగించు అన్న. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. యాపిల్ మనకు సెట్ అవ్వదు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మీరు ట్వీట్ చేసింది ఐఫోన్ నుంచే కదా అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తుండగా.. అహిసోర్‌ సోల్మన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు బ్రహ్మస్త్ర అనే సినిమాలో నాగ్ నటిస్తున్నాడు.