వైరల్: హాల్‌టికెట్‌లో సన్నీలియోన్ పేరు

ఇండియాలో సన్నీలియోన్ పేరు మీద ఆధార్ కార్డు, ఓటర్ లిస్ట్‌లో సన్నీలియోన్ పేరు ఉన్న ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా హాల్‌టికెట్‌లో సన్నీలియోన్ పేరు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భీమ్‌రావ్ అంబేడ్కర్ బీహార్ యూనివర్సిటీకి అనుబంధంగా మీనాపూర్‌లో ఉన్న ధన్‌రాజ్ మహతో డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కుందన్ కుమార్ అనే విద్యార్థి వల్ల ఈ పొరపాటు జరిగింది. కుందన్ కుమార్ తన హాల్‌టికెట్‌తో తండ్రి పేరు ముందు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పేరు రాయగా.. తల్లి పేరు సన్నీలియోన్ అని రాశాడు.

sunny leone

ఈ హాల్‌టికెట్‌తో సన్నీలియోన్ పేరు చూసి కాలేజీ సిబ్బంది కూడా ఆశ్చర్యపోతున్నారు. తల్లిదండ్రుల పేర్లు తప్పుగా ప్రచురితమై ఉండవచ్చని, ఆ విద్యార్థి కూడా దీనికి బాధ్యత వహించాల్సిఉంటుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామకృష్ణ ఠాగూర్ చెబుతున్నారు. ఆధార్ కార్డు, హాట్ టికెట్‌లో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ విద్యార్థి వివరాలు కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, దీనికి సంబంధించిన నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ హాల్‌టికెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై నటుడు ఇమ్రాన్ హష్మీ స్పందించాడు. ఆ విద్యార్థికి, నాకు ఎలాంటి సంబంధం లేదని, ప్రమాణం చేస్తున్నానని అని కామెంట్ చేశాడు.