మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు అట్టాహాసంగా జరుగుతున్నాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో నిహారిక పెళ్లి వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు అక్కడికి చేరుకుని పెళ్లి పనులు చూసుకుంటూ సందడి సందడి చేస్తున్నారు. ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా.. ఇటీవల బంధువులతో కలిసి సందడి చేస్తున్న ఫొటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవలు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, చిన్న కూతురు శ్రీజ కలిసి నిహారికను పెళ్లి కూతురిని చేశారు. ఈ ఫొటోలలో బ్లూ కలర్ చీరలో నిహారిక కనిపించింది. ఆ చీర వెనుక ఉన్న చాలా పెద్ద కథే ఉందట. అది 32 ఏళ్ల నాటి చీర అట. నిహారిక అమ్మ పద్మజ తన నిశ్చితార్ధం రోజు కట్టుకున్న చీర అట. ఆ చీరనే ఇప్పుడు తాను కట్టుకున్నానని నిహారిక బయటపెట్టింది. తన తల్లి పద్మజ నిశ్చితార్థం రోజు ఈ చీర కట్టుకుని ఉన్న ఫొటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. అమ్మ, కూతురు ఒకేలా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. కాగా గుంటూరుకు చెందని జొన్నలగడ్డ చైతన్యను నిహారిక లవ్ మ్యారేజ్ చేసుకోనుంది. గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరి ప్రేమించుకుంటుండగా… ఇప్పుడు కుటుంభసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు.