‘RRR’ కోసం రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకే సినిమాలో ఇద్దురు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన వారిద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్లు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

alia butt

లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్‌లో RRR షూటింగ్ జరుగుతోంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా హైదరాబాద్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఆమె నడుచుకుంటూ వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియాన్ గ్రీన్ డెనిమ్ జాకెట్ ధరించి కళ్లకు కూల్ గ్లాసెస్ పెట్టుకుంది.

ఈ లుక్‌లో అలియా చాలా స్ట్రైలిష్‌గా ఉంది. RRR సినిమాలో రాంచరణ్‌కు జంటగా ఆలియా నటిస్తుండగా.. ఇప్పటికే వీరిద్దరి మధ్య కొన్ని సీన్లు తెరకెక్కించారు. కానీ ఇంకా కొన్ని కీలక సీన్లు పెండింగ్‌లో ఉండటంతో.. వాటిని ఇప్పుడు RRR యూనిట్ పూర్తి చేయనుంది. రాంచరణ్, ఎన్టీఆర్‌లతో కొన్ని కాంబినేషన్ సీన్లలో ఆలియా కనిపించనుందని తెలుస్తోంది.