విజయ్ అభిమానులకు సర్‌ప్రైజ్

కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్ తలపతి నటించిన ‘మాస్టర్’ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తమిళంలో విజయ్‌కు అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో విజయ్ సినిమా విడుదలైతే నానా హంగామా చేస్తారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించంతో.. త్వరలో విడుదల కానున్న ‘మాస్టర్’ సినిమాపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదలయ్యే అవకాశముంది.

vijay

ఈ క్రమంలో త్వరలో విజయ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ మాస్టర్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరి నెలలో మాస్టర్ ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశముంది. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్ రికార్డు వ్యూస్, లైక్స్ సొంతం చేసుకోవడంతో.. ఇక ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

లోకేష్ కనగనరాజ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇందుల విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. దీంతో విలన్‌గా విజయ్ సేతుపతి నటన ఎలా ఉంటుందనే దాని కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సిన ఉండగా.. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఆలస్యంగా విడుదల అవుతోంది.