తెలుగు బిగ్‌బాస్ షో మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఫైనల్‌కి సమయం దగ్గర పడుతుండటంతో కంటెస్టెంట్లు అందరూ ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు. మొన్నటివరకు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని మోనాల్ కూడా ఇప్పుడు గట్టిగా ఆడుతోంది. కంటెస్టెంట్లు అందరూ ఫ్రెండ్షిప్ లాంటివి పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ పెట్టారు. ఫైనల్‌కి వెళ్లి బిగ్‌బాస్-4 టైటిల్ గెలవాలనే కసి అందరిలోనూ కనిపిస్తోంది.
అయితే బిగ్‌బాస్ అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. బిగ్‌బాస్ షోలో పాల్గొనాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ బిగ్‌బాస్ షోకి వెళ్లి అనారోగ్యం కారణంగా బయటికి వచ్చేసిన ఈ కంటెస్టెంట్.. ఇప్పుడు బిగ్‌బాస్‌కి అనవసరంగా వెళ్లానని అంటున్నాడు. అతడెవరో కాదు.. నోయల్.. బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న నోయల్.. తన గేమ్‌తో కొన్ని వారాల పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దీంతో అతడు విన్నర్ అవుతాడనే చర్చ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అనారోగ్యం కారణంతో అనూహ్యంగా హౌస్ నుంచి నోయల్ బయటికి వచ్చాడు.
బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కంటెస్టెంట్లు యూట్యూబ్ ఛానెల్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. కానీ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నోయల్ మీడియా ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే తాజాగా నోయల్‌ను బిగ్‌బాస్ కంటెస్టెంట్ హారిక బ్రదర్ వంశీ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ జర్నీ ఎలా అనిపించిందని వంశీ అడగ్గా.. ఎందుకు వెళ్లానా అని అనిపించిందని నోయల్ సమాధానం ఇచ్చాడు. ఇక బిగ్‌బాస్‌కి వెళ్లి ఏమైనా నేర్చుకున్నారా? అని వంశీ అడగ్గా.. బిగ్‌బాస్‌కి వెళ్లడమే తప్పు అని, కొత్తగా అక్కడ నేర్చుకున్నది ఏమీ లేదన్నాడు. బిగ్‌బాస్‌కి వెళ్లకుండా ఉండాల్సిందన్నాడు.