దివంగత బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాని మోదీని వెనక్కి నెట్టడం ఏంటీ? అని అనుకుంటున్నారా.. అవును.. మీరు విన్నది నిజమే.. సోషల్ మీడియాలో మోదీని సుశాంత్ సింగ్ వెనక్కి నెట్టాడట. యాహూ ఇండియా సెర్చ్ ఇంజిన్ తాజాగా ఈ ఏడాది నెటిజన్లు ఎక్కవ సెర్చ్ చేసిన సెలబ్రెటీల వివరాలను బయటపెట్టింది. ఇందులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి స్థానంలో ఉండగా.. ప్రధాని మోదీ రెండవ స్థానంలో ఉన్నారు. ఇక మూడవ ప్లేస్‌లో డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ఉంది.
2017వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ప్రధాని మోదీ తొలి స్థానంలో ఉంటున్నారు. అయితే ఈ ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం సంచనలనంగా మారింది. అతడి ఆత్మహత్య చేసుకోవడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అతడి ఆత్మహత్య చేసుకోవడం వివాదాస్పదంగా మారగా.. ఈ కేసుపై సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. దీంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి తెలుసుకునేందుకు చాలామంది నెట్లో సెర్చ్ చేశారు.
ఇక ఈ జాబితాలో రాహుల్ గాంధీ, అమిత్ షా, ఉద్దవ్ ఠాక్రే,అరవింద్ కేజ్రీవాల్,మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయుకులు ఉన్నారు. ఇక సినీ సెలబ్రెటీల నుంచి సుశాంత్, రియా చక్రవర్తి తర్వాత కంగనా రనౌత్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఇక కరోనా సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూసూద్ హీరోగా ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. మోస్ట్ సర్చ్డ్ ఫిమేల్ (మహిళల) సెలబ్రిటీ క్యాటగిరిలో రియా చక్రవర్తి తొలి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో కంగన రనౌత్, దీపిక పదుకోన్, సన్నీలియోన్, ప్రియాంక చోప్రా పేర్లు కనిపించాయి.