నాగార్జున సినిమాలో నాగచైతన్య, అఖిల్

అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ నటించిన మనం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ఇదే కావడంతో గమనార్హం. ఇందులో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించారు. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2014లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలోనే అది పెద్ద మల్టీస్టారర్ సినిమా ఇదే.

nagarjuna

అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ సినిమా రాబోతుందని గత కొద్దిరోజులుగా సినీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా ఓకే అయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ననాయన సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కథను సిద్ధం చేసుకున్నాడు.

ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇది పూర్తైన తర్వాత ఈ మాల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని సమాచారం.