కేజీఎఫ్ డైరెక్టర్‌తో ప్రభాస్ సినిమా.. టైటిల్ ఫిక్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్టుకు రెడీ అయ్యాడు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు ప్రభాస్ సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. పాన్ ఇండియా ఈ సినిమాను తెరకెక్కించనుండగా.. దీనికి సాలార్ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ మేరకు మేకర్స్ తాజాగా ప్రభాస్ ఫొటోతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

Salaar

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రభాస్ గన్ పట్టుకుని కూర్చోని ఉన్నాడు. ఇందులో మీసాలతో ప్రభాస్ చాలా వయలెంట్‌గా ఉన్నాడు. ఇటీవలే కేజీఎఫ్-2 షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ కలిసి స్టోరీని డిస్కస్ చేశాడు. ఈ కథ నచ్చడంతో ప్రభాస్ సినిమాకు ఒకే చెప్పాడు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రాధేశ్యామ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశముంది.

ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోల రానున్న సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో విడుదల చేయనున్నారు. కేజీఎఫ్ సినిమాను రూపొందించిన నిర్మాతలే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్-2 చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. ప్రస్తుతం హీరో యశ్, సంజయ్ దత్ మీద పలు సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తైన వెంటనే ప్రభాస్ సినిమా ప్రారంభం కానుంది.