టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన తాప్సి.. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలు బయపెట్టింది. తాను కూడా ప్రేమలో పడ్డానని, తొమ్మిదో తరగతిలోనే ఒక అబ్బాయిని ప్రేమించానని చెబుతోంది. ఆ అబ్బాయిని ఎంతో ఇష్టపడ్డానని, ఆ అబ్బాయే తనకు ఫస్ట్ క్రష్ అని చెప్పింది. అతడు కూడా తనను ఎంతో ఇష్టపడ్డాడని చెప్పింది.
కానీ ప్రేమలో పడితే సరిగ్గా చదవలేననే భయంతో ఆ అబ్బాయితో మాట్లాడటం మానేశానని తాప్సి చెప్పింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి గుర్తొచ్చాడని, అప్పట్లో తన దగ్గర ఫోన్ లేకపోవడంతో పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి అతడికి ఫోన్ చేసి ఏడ్చానని తాప్సి తాజాగా తన చిన్నప్పటి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. తొలి ప్రేమ ఎప్పటికీ తీపి గుర్తు అని తాప్సి చెప్పింది.
కరోనా వల్ల ఇంట్లో ఉండి బోర్ కొట్టిందని, అందుకే మాల్ధీవులకు వెళ్లి వెకేషన్‌ను వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు తాప్సి తెలిపింది. గ్లామర్ రోల్స్ విషయంలో తనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయని ఈ అమ్మడు చెబుతోంది. ఆ రూల్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవుతానని తాప్సి చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది. టాలీవుడ్‌లో మాత్రం ఆ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం లేదు.