బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్‌బాస్-4 ఫైనల్‌కు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఇప్పటినుంచే జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ కీలకం కానుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ల మధ్య ఫైనల్ పోరు జరుగుతుండటంతో ఇప్పటినుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. దీంతో ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉండనుంది. గత వారం ఎలిమినేట్ కావాల్సిన అవినాష్ ఎవిక్షన్ పాస్ వల్ల సేవ్ అయ్యాడు. అయితే ఈ సారి సేవ్ అయ్యే పరిస్థితి లేదు.

bigboss 4

ఈ వారం నామినేషన్స్‌లో మోనాల్, అభిజిత్, హారిక, అఖిల్, అవినాష్ ఉన్నారు. వీరిలో ఈ వారం అవినాష్ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. గత వారం అవినాష్‌కు బాగా తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ వారం కూడా అతడికి బాగా తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం ఒ కంటెస్టెంట్, వచ్చే వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు.

దీంతో చివరివారానికి ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండనున్నారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనినాష్..ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేశాడు. గేమ్ బాగా ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో అవినాష్‌ని అంతగా కంటెస్టెంట్లు ఎవరూ నామినేట్ చేయలేదు. దీంతో అతడు కొన్నివారాలు అతడు సేవ్ అయ్యాడు. కానీ గేమ్ చివరికి వస్తుండటంతో మిగతా వారితో పోల్చితే అవినాష్‌ వీక్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు