తెలుగుతో పాటు తమిళంలో కూడా బిగ్‌బాస్ సీజన్-4 కొనసాగుతోంది. తెలుగులో మరో 4 వారాల్లో షో ముగియనుండగా.. తమిళంలో ఇటీవలే మొదలైంది. తమిళ బాగ్బాస్కి కమల్‌హాసన్ హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడును ‘నివర్’ తుఫాన్ ముంచెత్తుతోంది. దీంతో వరదనీరు ఇంట్లోకి చేరుకోవడంతో కొన్నిచోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్ తమిళ బిగ్‌బాస్ హౌస్‌పై కూడా పడింది.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వరద నీరు చేరుకున్నాయి. దీంతో హౌస్మెట్స్ రూమ్స్‌లోకి వరద నీరు భారీగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హౌస్‌మెట్స్‌ని సీక్రెట్‌గా ఒక ప్రైవేట్ హోటల్‌కి తరలించినట్లు సమాచారం. ఎక్కడికి వెళుతున్నామనేది తెలియకుండా కంటెస్టెంట్స్ కళ్లకు గంతలు కట్టారట. కంటెస్టెంట్స్ ఒకరినొకరు మాట్లాడుకోకుండా వేరువేరుగా వాహనాల్లో ప్రైవేట్ హోటల్‌కు నిర్వాహకులు తీసుకెళ్లారట.
బిగ్‌బాస్ హౌస్‌లోకి చేరుకున్న వరద నీటిని ఇంజిన్లు పెట్టి బయటికి పంపించారట. అనంతరం కంటెస్టెంట్ల రూంలను శుభ్రం చేసి తిరిగి ప్రైవేట్ హోటల్ నుంచి కంటెస్టెంట్స్ ని హౌస్‌లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం వరద నీరు రాలేదని, టాస్క్‌లో భాగంగానే హోటల్‌కి తీసుకెళ్లామని చెబుతున్నారు.