ఈ వారం బిగ్‌బాస్ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్

బిగ్‌బాస్-4 రసవత్తరంగా జరుగుతోంది. ప్రస్తుతం దెయ్యం టాస్కు జరుగుతుండగా.. చూడటానికి ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంది. రేపు, ఎల్లుండి ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు సేవ్ అవుతారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అభిజిత్, మోనాల్, అఖిల్, సోహెల్, అరియానా, హరిక, అవినాష్ ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే ఇక ఆరుగురు మాత్రమే ఉంటారు.

bigboss

ప్రస్తుతం నామినేషన్‌లో అవినాష్, అరియానా, మోనాల్, అఖిల్ ఉన్నారు. వీరిలో ఈ వారం అవినాష్‌కి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఎవిక్షన్ ఫ్రీ సాస్ వల్ల అవినాష్‌కి ఇమ్యూనిటీ లభించింది. దీంతో ఈ వారం అవినాష్‌ని ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. దీని వల్ల ఈ వారం అసలు ఎవరినీ ఎలిమినేట్ చేయరని తెలుస్తోంది.

వచ్చే రెండు వారాలు వరుసగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశముందని బిగ్‌బాస్ వర్గాల నుంచి తెలుస్తోంది. వచ్చే రెండు వారాలు ఇద్దరిని ఎలిమినేట్ చేసినా తర్వాత మిగిలినవారు చివరి వారం ఫైనల్ 5లో ఉంటారని సమాచారం.