ఓటీటీలపై నిఘా పెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఫిల్మ్ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరలో ఓటీటీలలో విడుదలయ్యే వెబ్‌సిరీస్‌లతో పాటు ఇతర కంటెంట్‌కు కూడా సెన్సార్షిప్ ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు సినీ డైరెక్టర్లు, నిర్మాతలను భయపెడుతున్నాయి.
అయితే దీనిపై ప్రముఖ దర్శకురాలు అలకృత శ్రీవాస్తవ తాజాగా స్పందించారు. గతంలో ఆమె ఫీచర్ ఫిల్మ్ ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ సెన్సార్ ఇబ్బందును ఎదుర్కొవాల్సి వచ్చింది. తాజాగా ఆడవారి లైంగికత మీద ఆమె తీసిన ‘Dolly Kitty Aur Woh Chamakte Sitare’సినిమా ఎటువంటి సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొలేదు.
అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం స్ట్రీమింగ్ కంటెంట్‌ను ప్రభావితం చేయదని తాను ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది. ‘మేము ఏమి తీయాలనుకుంటున్నామో అది తీస్తాం. ఎమైనా ఇబ్బందులను కలిగి ఉంటే వాటిపై మేము పోరాడతాం. నేను సెన్సార్‌షిప్‌కు పూర్తి వ్యతిరేకం . అన్ని మాధ్యమాలలో సెన్సార్షిప్ కాకుండా వయస్సు రేటింగ్‌లు పరంగా ధృవీకరణ ఉండాలి అని నేను అనుకుంటున్నాను’ అని ఆమె తెలిపింది.