రాంచరణ్‌తో రోమాన్స్ చేస్తామంటున్న ఆ ముగ్గురు భామలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా.. అతడి పక్కన హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే కియారా అద్వానీ, రష్మీక మందన్నా, సాయిపల్లవి పేర్లు వినిపిస్తున్నాయి.

ఆ ముగ్గురిలో రాంచరణ్‌తో సినిమాలో ఎవరు రోమాన్స్ చేస్తారనేది త్వరలో తేలనుంది. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయి, ఆ తర్వాత నెగిటివ్ రావడంతో ఈ షూటింగ్‌లో చిరు పాల్గొనలేదు. సినిమాలోని ఇతర నటీనటులపై పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో చిరు పాల్గొననున్నారు. అటు తన భర్తతో కలిసి హానీమూన్‌ను పూర్తిచేసుకున్న ఇండియాకు తిరిగి వచ్చిన కాజల్.. త్వరలోనే ఆచార్య షూటింగ్‌లో పాల్గొననుంది. రాంచరణ్ కూడా త్వరలో షూటింగ్‌లో పాల్గొనే అవకాశముంది.