షారూఖ్ ఖాన్‌ ఇంట్లో ఒక నైట్ ఉండాలనుకుంటున్నారా?

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తన ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ఇంట్లో ఒక రాత్రి ఉండవచ్చని, కానీ దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాడు. కపుల్స్‌కి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, నవంబర్ 18 నుంచి క్యాంపెయిన్ మొదలవుతుందని చెప్పాడు. అప్లై చేసుకున్నవారిలో ఒకరిని ఎంపిక చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఒక నైట్ ఢిల్లీలోని తన ఇంట్లో గడిపే అవకాశం కల్పిస్తానని తెలిపాడు.

ముంబైలోని మన్నాట్‌లో షారూఖ్ ఖాన్‌కు ఒక ఇళ్లు ఉండగా.. ఢిల్లీలో కూడా మరో హౌస్ ఉంది. ఇటీవల ఈ హౌస్‌ను షారూఖ్ ఖాన్ భార్య గౌరీ రీడిజైన్ చేయించింది. షారూఖ్-గౌరీ దంపతులకు ఈ హౌస్ ఎంతో ప్రత్యేకమైనది. వారిద్దరి చిన్నతనం మెమెరీస్‌తో పాటు ప్రేమకథకు సంబంధించిన ఎన్నో మరిచిపోలేని మెమెరీస్ ఈ ఇంటితో ముడిపడి ఉన్నాయి. తన భార్య కోసం షారూఖ్ ఈ ఇంటిని కట్టించాడు.

ముంబైలోని మానత్‌లో షారూఖ్‌ రూ.200 కోట్లతో ఇళ్లు నిర్మించుకున్నాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి షారూఖ్ ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లినప్పుడు ఇక్కడి ఇంట్లో షారూఖ్ గడుపుతాడు.