బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిపై ఏకంగా రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేయడం సంచలనంగా మారింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో అక్షయ్ హస్తం ఉందంటూ సిద్దిఖీ అనే వ్యక్తి యూట్యూబ్‌లో ఫేక్ న్యూస్‌లు వ్యాప్తి చేశాడు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రేఖా చక్రవర్తితో అక్షయ్‌కు లింకులు ఉన్నాయని, ఆమె కెనడా పారిపోవడానికి అక్షయ్ హెల్ప్ చేశాడని ఫేక్ న్యూస్ పెట్టాడు.
ఈ ఫేక్ వార్తల వల్ల సిద్దిఖీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ 2 లక్షల నుంచి 3 లక్షలకు చేరుకున్నాయి. ఈ వీడియోలకు గాను అతడికి 4 నెలల్లో రూ.15 లక్షల డబ్బులు వచ్చాయి. ఫేక్ న్యూస్‌లు వ్యాప్తి చేసి తమ పరువుకు భంగం కలిగించినందుకు అతడిపై అక్షయ్ ఈ పరువు నష్టం దావా వేశాడు.
ఈ కేసు గురించి మహారాష్ట్ర సీఎం ఆదిత్య ఠాక్రే, ముంబై పోలీసులతో అక్షయ్ సీక్రెట్ మీటింగ్స్ పెట్టాడని యూట్యూబర్ ఆరోపించాడు. ఎంఎస్ ధోనీ బయోపిక్ లాంటి పెద్ద సినిమాలు సుశాంత్ సింగ్ చేయడం అక్షయ్‌కు ఇష్టం లేదని సిద్దీఖీ వీడియో పోస్ట్ చేశాడు.