బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన దగ్గర పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకడంతో సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సల్మాన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో కరోనా చైన్‌ను బ్రేక్ చేయడానికి 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండనున్నట్లు సల్మాన్ ఖాన్ చెప్పాడు.
తన కుటుంబసభ్యుల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే కరోనా బారిన పడ్డ తన సిబ్బందిని ముంబైలోని ఒక ఆస్పత్రిలో సల్మాన్ చేర్చినట్లు తెలుస్తోంది. ఇటీవల తనను కలిసినవారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని సల్మాన్ సూచించాడు.
కాగా ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ‘రాధే’ సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్ సరసన దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. లాక్డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం కావడంతో ఇటీవల దీని షూటింగ్లో సల్మాన్ పాల్గొన్నాడు. సల్మాన్ తండ్రి సలీంఖాన్, సల్మాఖాన్ ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా జరగబోయే వేడుకను ఇటీవల కరోనా వల్ల సల్మాన్ రద్దు చేశారు