నా భర్త రానా దగ్గుబాటి అందమైనవాడు కాదా?.. మిహీక

రానా-మిహీక జంట ఆగస్టు 8న రామానాయుడు స్టూడియోలో కొంతమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట హానీమూన్‌ను కూడా ఎంజాయ్ చేశారు. దీంతో ఇక సినిమాలపై ఫోకస్ పెట్టిన రానా.. ప్రస్తుతం షూటింగ్‌లలో బిజీగా ఉన్నాడు. అయితే ఒక స్వయంగా ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టిన రానా.. తాజాగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ అండర్‌టేకర్‌తో సోషల్ మీడియాలో ముచ్చటించాడు.

RANA MIHIKA

అండర్‌టేకర్‌తో రానా ముచ్చటిస్తున్న ఫొటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మిహీక పోస్ట్ చేసింది. ‘నా భర్త అందమైనవాడు కాదా? అని అభిమానులను ప్రశ్నించింది. దీంతో నెటిజన్లు హో క్యూట్ అని కామెంట్ చేస్తున్నారు.

రానా నటించిన ఆరణ్య సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రానా నటిస్తున్న విరాటపర్వం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో రానా సరసన సాయిపల్లవి నటిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది. అటు రానా హీరోగా గుణశేఖర్ తెరకెక్కించనున్న హిరణ్య కశ్యప్య సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.