‘సామ్ జామ్’షోకు సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఒకవైపు సినిమాలు చేస్తూనే… మరోవైపు హోస్టింగ్ కూడా చేస్తోంది హీరోయిన్ సమంత. ఇటీవల దసరా సందర్భంగా బిగ్‌బాస్-4కు సమంత హోస్టింగ్ చేయడంతో ఆ షోకు టీఆర్‌పీ రేటింగ్స్ ఒక్కసారిగా పెరిగాయి. ముద్దు ముద్దు మాటలతో సమంత చేసిన హోస్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బిగ్‌బాస్ హోస్టింగ్ సమంత బాగా చేయడంతో.. ఆమెతో ట ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా ‘సామ్ జామ్’ పేరుతో టాక్ షో చేయిస్తోంది.

SAMANTHA

ఈ నెల 13న ఆహా యాప్‌లో ఈ షో ప్రారంభమవ్వగా.. తొలి షో యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సమంత చేసింది. విజయ్ దేవరకొండతో సమంత చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం ఆహా యాప్‌లో అందుబాటులో ఉంది. త్వరలో చిరంజీవి, అల్లు అర్జున్, తమన్నాతో సమంత చేసిన ఇంటర్వ్యూలు స్ట్రీమింగ్ కానున్నాయి.

ఈ షో చేయడానికి పది ఎపిసోడ్స్‌కు గాను సమంత కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంత యాంకరింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చడం, పెద్ద పెద్ద సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తుండటంతో సామ్ జామ్ షో బాగా హిట్ అవుతోంది.