
ప్యాలెస్ తలుపులు తెరుచుకున్నాయో లేదో.. అప్పుడే ‘ది ట్రైటర్స్ తెలుగు’లో నమ్మకం సన్నగిల్లుతోంది. నమ్మకం, మోసం, ద్రోహంతో కూడిన ఈ గేమ్‌లోకి 20 మంది సెలబ్రిటీ ప్లేయర్స్ అడుగుపెట్టడంతో అనుమానాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆరోపణలు వ్యక్తిగత స్థాయికి చేరుకుంటుండగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే ప్లేయర్స్ సైతం తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. మరోవైపు మిస్టరీని పెంచుతున్న ఓ ముసుగు ధరించిన వ్యక్తి, శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే టాస్కులు, ఉత్కంఠను పెంచుతున్న ‘రింగ్ ఆఫ్ డౌట్’తో తొలి మూడు ఎపిసోడ్లు ఆసక్తికరంగా సాగనున్నాయి. ఈ గేమ్‌లో ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవాల్సిందే.. ఏమాత్రం అప్రమత్తత కోల్పోయినా ప్రమాదమే!
హోస్ట్ తేజ సజ్జా చెప్పినట్లుగా, “ఇక్కడ ట్రైటర్స్ మాస్టర్ మానిప్యులేటర్స్గా మారతారు. ఇన్నోసెంట్స్ డిటెక్టివ్‌లుగా ఎదుగుతారు.” ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో తమను తాము నిర్దోషులుగా నిరూపించుకునేందుకు ప్లేయర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హీటెక్కిన ‘రింగ్ ఆఫ్ డౌట్’లో విద్యు తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, “నాపై అనుమానం వస్తే.. నేను జోకర్లా నటించలేను.. 24 గంటలూ అలా ఉండలేను” అని అంటుంది. అంతేకాదు, “నేను ట్రైటర్‌ను అయితే చచ్చిపోతా” అని కూడా ప్రకటిస్తుంది.
మరోవైపు శ్రావ్య తన వైఖరిని స్పష్టంగా చెబుతూ, “నేను చాలా రకాలుగా ఉండొచ్చు. కానీ అబద్ధాలకోరును మాత్రం కాదు” అని అంటుంది. ప్రశ్నలు ఎదురైనప్పుడు ఫల్గుణి కూడా వెంటనే స్పందిస్తుంది. “అతడిని హత్య చేసేంత తెలివితక్కువదాన్నా నేను? అలా చేస్తే చివరికి ఆ నేరం నా దగ్గరికే తిరిగి వస్తుందని నాకు తెలుసు” అని ప్రశ్నిస్తుంది.
ఉత్కంఠ కేవలం మాటలకే పరిమితం కావడం లేదు. ప్యాలెస్ వెలుపల ఆట మరింత కఠినంగా మారుతోంది. బంగారు కడ్డీలను ఎక్కిస్తూ, మోస్తూ చేసే శారీరక శ్రమతో కూడిన టాస్కులు ప్లేయర్స్ సామర్థ్యానికి పరీక్ష పెడుతున్నాయి. అదే సమయంలో ఆటపై ఏకాగ్రతను కొనసాగించడం కూడా వారికి సవాలుగా మారుతోంది.
మరోవైపు గౌరవ్ తన తోటి ప్లేయర్స్‌పై సెటైర్ వేస్తూ, “వీళ్లకంటే పిల్లలే బెటర్” అని అంటాడు. ఇక శ్రీదేవి “ఇదంతా చాలా మిడిల్ క్లాస్‌గా ఉంది” అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా గేమ్‌లో వేడిని మరింత పెంచుతున్నాయి.
ఆశ్చర్యపరిచే ద్రోహాలు, తీవ్ర స్థాయికి చేరే ఘర్షణలు, అంతులేని డ్రామా.. ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే! ఎందుకంటే ఈ గేమ్‌లో నమ్మకం కూడా ఒక రిస్క్.. ఫలితం మాత్రం ఎప్పుడూ ఊహించని మలుపే!
ఎస్ఓఎల్ ప్రొడక్షన్ నిర్మించిన ‘ది ట్రైటర్స్ తెలుగు’ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తెలుగులో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లు విడుదలవుతాయి.


