“రణబాలి” చిత్ర రివ్యూ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రణబాలి. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించగా టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నీరవ్ షా, జిష్ణు సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందించగా కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేశారు. ఆర్నాల్డ్ వోస్లు, ఈశ్వరి రావు తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
1800ల నాటి బ్రిటిష్ పరిపాలన సమయంలోని యదార్థ సంఘటనల నుండి తీసుకున్న కథ ఇది. రాయలసీమ ప్రాంతంలో కరువు అధికంగా ఉన్న సమయంలో బ్రిటిష్ వారు పన్ను రూపంలో తమ ధాన్యాన్ని వారి దేశానికి తరలించే పరిస్థితులలో తన ప్రాంత ప్రజలను తిరగబడిన ఒక వీరుడు రుణపడి. దైవ ఆశీస్సులతో పుట్టిన రణబాలి కాలక్రమమైన పెద్దవాడై పెళ్లి చేసుకుని ఉంటాడు. అటువంటి పరిస్థితులలో బ్రిటిష్ వారు తన ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయం తెలుసుకొని వారిపై తిరగ పడతాడు. కరువును వాడుకుని వారి ఆకలి తీర్చేలా తమకు ఉపాధి కల్పిస్తాను అంటూ బ్రిటిష్ వారు భారతీయుల చేత రైల్వే మార్గం వేసే పనులలో అతి క్రూరంగా ప్రవర్తించడం తెలిసిన రణబాలి వారిపై ఎలా తిరగబడతాడు? ఈ వైరంలో అతను గెలుస్తాడా లేదా? రణబాలిని పట్టుకునేందుకు బ్రిటిష్ వారు చేసిన ప్రయత్నాలు ఎటువంటివి? వారు దానికోసం ఎంతటి క్రూరత్వానికి తెగిస్తారు? చివరికి రణబాలిని గెలుస్తారా లేదా రణబాలి గెలుస్తాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ చాలా బాగా నటించారు. 1800ల నాటి వాతావరణంలో రాయలసీమ వ్యాసం మాట్లాడుతూ ఎక్కడ తడబడకుండా ఒక ధైర్యవంతుడైన యోధుడి లాగా కనిపిస్తూ అద్భుతంగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. హార్స్ రైడింగ్ అలాగే కత్తి సాము వంటి విషయాలలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించారు. రష్మిక మందన్న జయమ్మ పాత్రలో చాలా బాగా నటించారు. గ్లామర్ తో ఎటువంటి సంబంధం లేకుండా నాటి కట్టు బొట్టులతో ఎంతో ఆకర్షణీయంగా ఆమె వెండి ధరపై అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. రణబాలి తల్లి పాత్రలో ఈశ్వరి రావ్ పర్ఫామెన్స్ చాలా బాగుంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన ఆర్నాల్డ్ వోస్లు తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హాలీవుడ్ చిత్రాలలో నటించిన ఈ నటుడు ఈ సినిమాకు ఒక ప్లస్ గా నిలిచారు. అలాగే చిత్రంలో ఇతర పాత్రలు పోషించిన నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
యదార్థ సంఘటనల నుండి తీసుకున్న కథను ప్రేక్షకులకు ఎమోషన్ గా కనెక్ట్ చేసి వెండితెరపై చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ సినిమాలో ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ చాప్టర్ వైస్ చూపించిన తీరు చాలా బాగుంది. ఆనాటి రాయలసీమ బ్యాగ్రౌండ్ లో అప్పటి దుస్తులలో అప్పటి వాతావరణాన్ని చూపిస్తూ ముఖ్యంగా లొకేషన్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని దర్శకుడు ముందుకు తీసుకుని వెళ్లారు. ఆ లొకేషన్స్ అలాగే అప్పటి పరిస్థితులు చూపించడంలో సినిమాటోగ్రాఫర్ విజయం సాధించారు. పాటలు చాలా బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తపడితే బాగుండేది. కలరింగ్ & థీమ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇతర సాంకేతిక విషయాలు బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, పాటలు

మైనస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని సన్నివేశాలు

సారాంశం :
రణబాలి చిత్రాన్ని ఒక కథలా కాకుండా మన చరిత్రల చూస్తూ నేటితనానికి నాడు కరువు వల్ల కలిగిన నష్టం అలాగే మన దేశ ప్రజల కోసం పోరాడిన యోధుల వీరగాధలను తెలిపే చిత్రంలా చూస్తూ కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం రణబాలి.

Related Articles

Latest Articles