
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించగా దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందించారు. శ్యామ్ ధూపాటి సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా శ్రావణ్ కటికనేని ఎడిటింగ్ చేశారు. నేడు విడుదలైన ఈ చిత్రలకు ఈ విషయానికి వస్తే…
కథ :
తెలంగాణలోని ఒక పల్లెటూరిలో సాధారణ మధ్యతరగతి కుటుంబ వ్యక్తి తన పెద్ద కూతురుకు ఒక తాగుబోతు వ్యక్తితో పెళ్లి కావడంతో తన పరువు పోయిందని భావిస్తూ రెండవ కూతురికి మంచి వ్యక్తితో పెళ్లి చేసి పోయిన తన పరుగును తీసుకురావాలని ఉంటాడు. అలా ఉండగా తన రెండో కూతురుకు ఒక అమెరికా సంబంధం వస్తుంది కానీ అప్పటికే ఆమె తన కాలేజీలోని మరొక వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తన తండ్రి కోసం అమెరికా వ్యక్తిని పెళ్లి చేసుకుందాం లేదా తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి పెళ్లి చేసుకుంటుందా? అసలు పెళ్లి చేసుకుంటుందా లేదా? ఇటువంటి పరిస్థితులలో తన కుటుంబాలపై వచ్చిన ఒత్తిడిలోని ఆ తండ్రి ఎలా హ్యాండిల్ చేస్తారు? అసలు తన పరువు పోవడానికి కారణం తన పెద్ద అల్లుడా, కాదా? తన పెద్ద అల్లుడు స్వభావం ఎలాంటిది? అని ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటులు నటన :
ఈ సినిమాలో మధ్యతరగతి తండ్రి పాత్రలో నటించిన నవరసరాయ వీకే నరేష్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. గతంలో ఎన్నో చిత్రాలలో ఆయన ఇటువంటి పాత పోషించినప్పటికీ ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన సింగిల్ టేక్ లో చేసిన ఒక సీన్ లో ప్రేక్షకులు అందరూ కంటతడి పెట్టుకుంటారు. ఒకటే సీన్లో ఆయనకు ఉన్న బిరుదు నవరసరాయ అనే ట్యాగ్ కు న్యాయం చేస్తూ అన్ని విధాలుగా ఆ సీన్ లో నటిస్తూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా చేశారు. అలాగే చదువు అంటే ఎంతో ఇష్టంగా తన కాళ్లపై తాను సొంతంగా నిలబడాలి అనే ఉద్దేశంతో కష్టపడే మధ్యతరగతి కుటుంబ అమ్మాయి పాత్రలో నటించిన అనుపమ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. బాలరాజు పాత్రలో తరుణ్ భాస్కర్ చేసిన పర్ఫామెన్స్ ఎప్పటికీ నిలిచిపోతుంది. ముఖ్యంగా ఆయన క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ అలాగే ఒక తాగుబోతు వ్యక్తి లాగా సినిమా అంతటా కనిపిస్తూ అలరించిన విధానం చాలా బాగుంది. అఖిల్ రాజ్ తన ప్రేయసి కోసం కష్టపడే ఒక మధ్య తరగతి కుటుంబ వ్యక్తీ లాగా కనిపిస్తూ బాగా పర్ఫార్మ్ చేశారు. సినిమాలో నటించిన ఇతర నటీనటులు అందరూ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
సాంకేతిక విశ్లేషణ :
పెళ్లికి జరిగే సమయంలో పెళ్లి మండపంలో ఉన్న మిగతా వాడి అందరి పరిస్థితి సాధారణంగా చూసేవాడికి కనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడే పెళ్లి పీటలపై కూర్చున్న పెళ్లి కూతురు పాయింట్ నుండి తీసుకొచ్చిన కథగా ఈ సినిమాని చెప్పవచ్చు. అలాగే ఒక మధ్యతరగతి ఆడపిల్ల తండ్రి పడే తపనలాగా ఈ చిత్ర కథను చెప్పుకోవచ్చు. అటువంటి చాలా సాధారణ విషయాన్ని ఎంతో సెన్సిటివ్ గా హ్యాండిల్ చేస్తూ వెండితెరపై ప్రేక్షకులకు చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఒక పల్లెటూరిలో సినిమా అంతా ఉండటం అక్కడి లొకేషన్స్ మరింత అద్భుతంగా కనిపిస్తూ ఒక నిజమైన కుటుంబ కథగా కనిపిస్తుంది. నరేష్ గారి సింగిల్ టేక్ సీన్ చూస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుందని అర్థమవుతుంది. పాటలు బాగున్నాయి, బిజిఎం కూడా బాగానే ఉంది. కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
దర్శకత్వం, నటీనటుల నటన, పాటలు, ఎమోషన్
మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు
సారాంశం :
ప్రతి కుటుంబం మనస్ఫూర్తిగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చూడవలసిన చిత్రం క్రేజీ కళ్యాణం.


