బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ ఒక వైపు హాట్ టాపిక్ గా నిలువుగా మరోవైపు కంగనా రనౌత్ vs శివసేన వార్ మరింత చర్చనీయాంశంగా మారింది. జనాల దృష్టి మొత్తం మరోసారి మారిపోయింది. ఉదయం వరకు రియా NCB విచారణ చర్చనీయాంశంగా మారగా ఇప్పుడు బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేతతో అందరి దృష్టి యూ టర్న్ తీసుకుంది.
బృహన్ ముంబై కార్పొరేషన్(BMC) అధికారులు బుధవారం రూ.48 కోట్ల విలువైన ఆమె బంగ్లాను కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కంగనా రనౌత్ కార్యాలయాన్ని నిర్మించారనే ఈ కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీఎంసి అధికారులు తెలిపారు. కంగనా, శివసేన పార్టీల మధ్య గత కొంత కాలంగా మాటల యుద్దం తీవ్రంగా మారుతున్న విషయం తెలిసిందే. అవసరం అయితే ముంబై రాజకీయాల్లోకి కూడా ఆమె అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కామెంట్స్ వస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటూ కాంట్రవర్సీ ట్వీట్ చేశారు. ఇక తన బిల్డింగ్ తన దృష్టిలో ఒక రామ మందిర్ అంటూ బాబర్, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారని.. అయితే ఇప్పుడు మళ్ళీ నిర్మించారన్న విషయం మర్చిపోవద్దని కంగనా వివరణ ఇచ్చింది. అలాగే జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేసింది.