‘మహేష్ బాబు’ కూడా షూటింగ్స్ మొదలుపెట్టేశాడు!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మొత్తానికి కెమెరా ముందుకు వచ్చాడు. లాక్ డౌన్ మొదలయినప్పటి నుంచి కుడా స్టార్ హీరోలు ఎవరు కూడా బయటకు రావడం లేదు. మహేష్ బాబు కూడా దాదాపు ఆరు నెలలు ఇంటికే పరిమితం అయ్యాడు. ఇక ఫైనల్ గా కొందరు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ ఫుల్ గా షూటింగ్స్ నిర్వహిస్తుండడంతో మహేష్ కూడా మొదలెట్టేసాడు.

నాగార్జున ఇటీవల బిగ్ బాస్ షో గ్రాండ్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నాగ్ చేస్తున్న ప్రయోగం బాగానే వర్కౌట్ అవుతోంది. ఇక మహేష్ కూడా మొదట యాడ్స్ ద్వారా షూటింగ్స్ స్టార్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల ప్లేస్ లో ఈ రోజు మహేష్ షూటింగ్ మొదలు పెట్టాడు. ఇక సాయి ధరమ్ తేజ్ అలాగే మరికొందరు హీరోలు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. ఇక పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ని నవంబర్ లో స్టార్ట్ చేయాలని మహేష్ ఒక ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం.