‘కన్నడ’ లో రీమేక్ కానున్న ‘3 ఐడియట్స్’..

అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘3 ఇడియట్స్’ 2009లో విడుదలై సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు, ఈ చిత్రం కన్నడలో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిని కెఆర్జి స్టూడియోస్ పతాకంపై నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హిందీ ‘3 ఇడియట్స్’ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించగా తమిళ్ లో శంకర్ దర్శకత్వం వహించారు. అందులో విజయ్, జీవా, శ్రీకాంత్ నటించగా తెలుగులో కూడా డబ్ చేశారు. అయినప్పటికీ, ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించాలని భారీ ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత కార్తీక్ గౌడ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ కన్నడ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింధి. అయితే ఇందులో చందనం 3 గణేష్, రాజేష్ కృష్ణ, మరియు దిగంత్ లేదా పునీత్ రాజ్‌కుమార్, శ్రీనగర్ కిట్టి, యోగేష్ వంటి స్టార్స్ 3 ఐడియట్స్ గా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్.