‘పల్లబురుసు’ నుంచి ‘కొత్త సోకు’ లిరికల్ వీడియో విడుదల

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పల్లబురుసు’ సినిమా నుంచి ‘కొత్త సోకు’ లిరికల్ వీడియో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు ఈ జానపద గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

గ్రామీణ వాతావరణం, పల్లె సంస్కృతి, పండుగ సందడిని ప్రతిబింబించే ఈ పాటలో హీరో వ్యక్తిత్వాన్ని సరదాగా చూపించారు. “అంగి జూడే… ఆతడి పొంగు జూడే… దోతి రంగు జూడే…” అనే హుక్ లైన్ ఆకట్టుకునేలా ఉంది.

ఈ పాటకు సురేష్ గంగుల సాహిత్యం అందించగా, పవన్ చ్ సంగీతం సమకూర్చారు. వాగ్దేవి ఆలపించిన ఈ పాట వినసొంపైన బాణీ, సరదా పదాలతో ఆకట్టుకుంటోంది.

ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, పల్లె జీవితంలోని అందాలను చూపించే వినోదాత్మక చిత్రంగా ‘పల్లబురుసు’ తెరకెక్కుతోంది.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎపిక్ స్టూడియోస్ తరఫున ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ, విష్ణు కొరియోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ‘కొత్త సోకు’ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ‘పల్లబురుసు’ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles

Latest Articles