తన తొలి చిత్రం ధడక్ నుండే తనపై విభిన్నమైన కామెంట్స్ వచ్చాయని అందులో నెగిటివ్ కామెంట్స్ తో పాటు పాజిటివ్ విషయాలు కూడా చాలానే ఉన్నట్లు జాన్వి కపూర్ వెల్లడించారు, అయినప్పటికీ, దాని గురించి పెద్దగా పట్టించుకోనని ఆమె అన్నారు. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సినిమా ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ నటనతో మంచి ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రం కొన్ని వివాదాలలో చిక్కుకున్నప్పటికీ, జాన్వి కపూర్ యొక్క అద్భుతమైన నటన ఓ వర్గం ప్రజల ప్రశంసలు అందుకుంది. 2018లో ఇషాన్ ఖతర్‌తో కలిసి ధడక్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన జాన్వీ అప్పటి నుంచే మనసుకు బాధ కలిగించే నెగిటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకనొక సందర్భంలో ‘నీ సినిమాలు చూడటానికి మీ అమ్మ లేదు.. ఆమె అదృష్టవంతురాలు’అని కూడా ఎగతాలి చేశారని జాన్వీ తెలిపింది. అయితే ఆ విషయాలను నేను అంతగా పట్టించుకోను అని ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ కూడా నన్ను బాధపెట్టలేవు అని జాన్వీ వివరణ ఇచ్చింది.