బిగ్ బాస్ 4: వైరల్ అవుతున్న మరో లిస్ట్

మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్స్ లిస్ట్ ఆల్ మోస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉన్నందున అత్యంత జాగ్రత్తగా టెస్టులు నిర్వహించి మరి హౌజ్ లోకి పంపనున్నారు. అయితే షోలోకి అడుగుపెట్టబోయే సభ్యులు వీరేనని గత వారం నుంచే అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

ఇక లేటెస్ట్ గా షోలోకి అడుగుపెట్టబోయే వారిలో వీరు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అందులో లాస్య, అరియానా గ్లోరి,
మహతల్లి ఫేమ్ జాహ్నవి, మంగ్లి, దేతడి హరిక, మోనాల్ గజ్జర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేకవాణి, రఘు మాస్టర్ భార్య ప్రణవి, ఇంకా కరాటే కల్యాణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఫైనల్ లిస్టులో వీరి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే మై విలేజ్ షో గంగవ్వ కూడా షోలోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.